ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిత్రుడి పదవీ విరమణకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. హెడ్ కానిస్టేబుల్ మృతి! - గుంటూరు ముఖ్యంశాలు

గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో లారీ.. బైకును ఢీ కొట్టిన ప్రమాదంలో.. ఓ హెడ్ కానిస్టేబుల్ మరణించారు. మృతుడు.. తెలంగాణలోని నల్గొండలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం....ఒకరు మృతి
ఫిరంగిపురంలో రోడ్డు ప్రమాదం....ఒకరు మృతి

By

Published : Feb 4, 2021, 7:39 AM IST

మిత్రుడి పదవీ విరమణకు వెళ్లిన ఓ హెడ్ కానిస్టేబుల్.. రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాద ఘటన.. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో జరిగింది. తెనాలికి చెందిన వేల్పుల శ్రీనివాస్.. తెలంగాణలోని నల్గొండలో ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ గా పని చేశారు. ఆయన.. మిత్రుడి పదవీ విరమణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు నరసరావుపేట వెళ్లారు.

విజయవాడలో రైల్వే టికెట్ ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్న కోటిరెడ్డితో కలిసి ద్విచక్రవాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. ఫిరంగిపురం సమీపంలో వారి వాహనాన్ని ఓ లారీ బలంగా ఢీ కొట్టింది. శ్రీనివాసరావు గాయాలపాలై.. అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాలపాలైన కోటిరెడ్డిని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details