కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన కూలీలు తమ గోడును హోంమంత్రికి విన్నపించుకున్నారు. సానుకూలంగా స్పందించిన ఆమె.. సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసి వలస కూలీలను సొంత గ్రామాలకు పంపించేందుకు సన్నాహాలు చేశారు. స్వగ్రామాలకు పంపించడంలో చొరవ చూపిన హోంమంత్రికి కూలీలు ధన్యవాదాలు తెలిపారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన... స్వగ్రామానికి వలస కూలీలు
హోంమంత్రి మేకతోటి సుచరిత చొరవతో కర్నూలు జిల్లా నుంచి గుంటూరు జిల్లాకు వచ్చిన వలస కూలీలు సొంత ఊర్లకు పయనమయ్యారు. వలస కూలీల దీనావస్థపై ఈటీవీ భారత్లో ఇచ్చిన కథనంపై హోంమంత్రి స్పందించి వలస కార్మికులు స్వగ్రామాలకు చేరేలా ఏర్పాట్లు చేశారు.
స్వంత గ్రామాలకు తరలి వెళ్తున్న వలస కూలీలు