రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు:అనగాని ప్రభుత్వ సంక్షేమ పథకాలే మరోసారి తెదేపాను, తనను గెలిపిస్తాయని గుంటూరు జిల్లా రేపల్లె తెలుగుదేశం అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ భరోసా వ్యక్తం చేశారు.గతంలో లేని విధంగా రేపల్లె మున్సిపాలిటీని 135 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. 611 కోట్ల రూపాయలతో ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ రోడ్ల భవన నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద15 కోట్ల రూపాయలు అందించామని వెల్లడించిన ఆయన... తీర ప్రాంతాల్లో 16 కోట్లతో తుఫాను రహిత భవనాలను నిర్మించామన్నారు. మత్స్యకారులకు మూడు జెట్టీలను నిర్మిస్తున్నామన్న అనగాని...110 కోట్లతో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించినట్లు పేర్కొన్నారు. రక్షిత మంచినీటికి 22 కోట్లు, విద్య, నూతన భవనాలను సుమారు 51 కోట్లతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అధికారంలోకి రాగానే రేపల్లె పట్టణంలో ఇండోర్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్ నిర్మిస్తామని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.
ఇవి కూడా చదవండి....