రాష్ట్ర వ్యాప్తంగా ఈ-కేవైసీ సమస్యతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్ శాఖ.. ఇతర శాఖలతో కుదుర్చుకున్న ఒప్పందం పూర్తయిన తర్వాత నుంచి సమస్య తలెత్తింది. ఈ నెల 13 నుంచే సమస్య ఉన్నా.. వరుసగా 3 రోజులు సంక్రాంతి సెలవులు వచ్చాయి కాబట్టి... ఆసమయంలో ఇబ్బంది లేకుండా పోయింది. అప్పటికీ రిజిస్ట్రేషన్ శాఖ ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా... రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద ప్రజలకు పడిగాపులు తప్పటం లేదు. గతంలో ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు.. ఉన్నతాధికారులు ఆధార్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసేందుకు అనుమతులు జారీ చేశారు. ఇప్పుడు అటువంటి సౌలభ్యం లేకపోవడమే.. ఇబ్బందులకు కారణమవుతోంది.
ముగిసిన గడువు... నిలిచిన రిజిస్ట్రేషన్లు - ekyc problem in state wide
రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రాష్ట్రంలో ఈకేవైసీ సమస్య