ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్‌: మంగళగిరిలో రెడ్‌జోన్‌ - మంగళగిరిలో రెడ్ జోన్

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదవడంపై.. అధికారులు అప్రమత్తమయ్యారు. ఇటీవల దిల్లీ నుంచి వచ్చిన ఇద్దరిలో.. వైరస్ సోకిన వ్యక్తి కుటుంబసభ్యులను ఐసోలేషన్​కు తరలించారు. ముందస్తు చర్యల్లో భాగంగా మరో వ్యక్తి కుటుంబీకులను క్వారంటైన్​ సెంటర్​కు తీసుకెళ్లారు. పట్టణంలోని కరోనా బాధితుడి నివాసం నుంచి 3 కిలోమీటర్ల పరిధిని రెడ్‌జోన్‌గా ప్రకటించినట్లు అధికారులు వెల్లడించారు.

కరోనా ఎఫెక్ట్‌: మంగళగిరిలో రెడ్‌జోన్‌
కరోనా ఎఫెక్ట్‌: మంగళగిరిలో రెడ్‌జోన్‌

By

Published : Apr 2, 2020, 8:29 PM IST

కరోనా ఎఫెక్ట్‌: మంగళగిరిలో రెడ్‌జోన్‌

గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ నమోదు కావటంపై అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పాజిటివ్ కేసు నమోదైన టిప్పర్ల బజార్ నుంచి సుమారు మూడు కిలోమీటర్ల మేర రెడ్​జోన్​, ఐదు కిలోమీటర్ల మేర బఫర్​ జోన్ ప్రకటించారు. రెడ్​జోన్ ప్రాంతంలో ప్రతిఇంటి వద్ద హైపో ద్రావణం చల్లారు. 144 సెక్షన్ అమలు చేశారు. బఫర్ జోన్​ లో క్రమం తప్పకుండా సర్వేలు చేయడం, హైపో ద్రావణం చల్లే విధంగా చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతానికి చెందిన వారు బయటకి రాకుండా ఆ ప్రాంతంలోని అన్ని వీధులలో రాకపోకలను నిలిపివేశారు.

దిల్లీ నుంచి వచ్చిన ఇద్దరిలో వైరస్ సోకిన వ్యక్తి కుటుంబసభ్యులను గుంటూరులోని కాటూరు మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్​కు తరలించారు. మరో వ్యక్తి నివాసం ఉండే నవులూరులోనూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించారు. వైరస్​ బారిన పడిన వ్యక్తికి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో మరో ఐదుగురు కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details