గుంటూరులోని పోస్టల్ కాలనీలో గురువారం రాత్రి పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తోన్న 133 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం తెలుసుకుని తనిఖీలు చేపట్టారు. 266 సంచుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. కార్డుదారులు, వేర్వేరు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచుకొని వాటిని ప్లాస్టిక్ సంచులలోకి మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శివరాం ప్రసాద్, ఏఎస్ఓ బాషా బియ్యాన్ని పరిశీలించారు. బయట నివాసగృహంగా కనిపిస్తున్నా లోపల చిన్నపాటి గోదామును తలపించేలా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం బస్తాలు ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఓవ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అధికారుల తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత
గుంటూరులో పౌరసరఫరాల అధికారులు అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి పై కేసు నమోదు చేశారు.
రేషన్ బియ్యం పట్టివేత