ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మెరుగైన చికిత్స అందించేందుకే కొవిడ్ కేర్ కేంద్రం: మోపిదేవి - nijampatnam latest news

గుంటూరు జిల్లా నిజాంపట్నంలో కొవిడ్ కేర్ సెంటర్​ను రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. తీర ప్రాంత ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా... ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.

rajyasabha member mopidevi venkataramana
రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ

By

Published : May 12, 2021, 7:14 PM IST

కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా.. గుంటూరు జిల్లా నిజాంపట్నం సామాజిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్ కేర్ సెంటర్​ను ఏర్పాటు చేశారు. 24 ఆక్సిజన్ పడకలతో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రారంభించారు. కొవిడ్ సెంటర్​లో కరోనా బాధితులకు అందుతున్న వైద్యం వివరాలపై ఆరా తీశారు.

సముద్ర తీర ప్రాంతంలో కరోనా సోకిన వారు దూర ప్రాంతాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని, ఈ క్రమంలో మెరుగైన చికిత్స అందక రోగులు ప్రాణాలు కొల్పుతున్నారని మోపిదేవి అన్నారు. ఈ సమస్యలను నివారించేందుకు ఇటీవల రేపల్లె సీహెచ్​సీలో కొవిడ్ చికిత్స కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పుడు నిజాంపట్నంలో కొవిడ్ కేర్ సెంటర్​ను ఏర్పాటు చేశామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి జగన్ అన్ని చర్యలు తీసుకుంటున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details