గుంటూరు నుంచి స్వస్థలాలకు వలస కూలీలు
గుంటూరులో చిక్కుకుపోయిన రాజస్థాన్ వలస కూలీలు... స్థానిక భాజపా నాయకుల చొరవతో స్వస్థలాలకు వెళ్లారు. రెండు ఆర్టీసీ బస్సుల్లో వారిని సొంత ప్రాంతాలకు తరలించారు.
లాక్డౌన్ కారణంగా రాజస్థాన్‌కు చెందిన వలస కూలీలు గుంటూరులో చిక్కుకుపోయారు. వారిని స్వస్థలాలకు పంపించేందుకు స్థానిక భాజపా నాయకులు చొరవ చూపారు. రాజస్థాన్‌లోని భాజపా ఎమ్మెల్యేలతో మాట్లాడి కార్మికులను తరలించారు. ఆ రాష్ట్రంలోని పాలీ ప్రాంత భాజపా ఎమ్మెల్యే జ్ఞానచంద్ రెండు ఆర్టీసీ బస్సులను గుంటూరుకు పంపారు. ఆ బస్సుల్లో రాజస్థాన్ వలస కార్మికులు సొంత ప్రాంతాలకు పయనమయ్యారు. మార్గమధ్యలో వారికి అవసరమైన భోజనం, తదదితర ఏర్పాట్లను గుంటూరు నగర భాజపా నాయకులు సమకూర్చారు.