ఒత్తిడి తట్టుకోలేక రైల్వే ఉద్యోగి ఆత్మహత్యాయత్నం - రైల్వే ఉద్యోగి
గుంటూరు రైల్వే డిపార్ట్మెంట్లో పని చేస్తున్న రైల్వే టెక్నీషియన్ పసుపుల పవన్ కుమారు పని ఒత్తిడి, అధికారుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేశారు.
గత రెండు నెలలుగా పవన్ కుమార్ అవిశ్రాంతంగా పని చేస్తున్నారు.తనకు ఆరోగ్యం క్షీణీస్తోందని....2 రోజులు సెలవు కోసం పది రోజుల నుండి అడుగుతున్నా...సెలవులు ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన పవన్ కుమార్ ఆత్మహత్య యత్నం చేశారు. 3రోజులు నుండి రాత్రి పగలు విధులు నిర్వహిస్తున్న సెలవులు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.నిత్యం పని ఒత్తిడితో అటు ఇంట్లో వారికి ఇటు అధికారులకి సమాధానం చెప్పుకోలేక ఒత్తిడికి గురవుతున్నామని అందుకే...ఆత్మహత్య పాల్పడినట్లు బాధితుడు వెల్లడించారు.రైల్వే డిపార్ట్మెంట్లో పని భారం బాగా పెరిగిందని తమకు నిమిషం కూడా తీరిక ఇవ్వడం లేదని సహోద్యోగులు వెల్లడించారు.తమకు తక్షణమే పని గంటలు తగ్గించి విరామ సమయం కేటాయించి న్యాయం చేయాలని సహా ఉద్యోగులు డిమాండ్ చేశారు.