గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం మారేళ్లవారిపాలెంలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ నేతలు బాణాసంచా కాల్చారు. బాణాసంచాను తెదేపా కార్యకర్తల ఇళ్లపై వేస్తుండగా వారు ఖండించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం నెలకొని రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు.
వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ... పలువురికి గాయాలు - guntur district crime
గుంటూరు జిల్లా మారేళ్లవారిపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
ఇరువర్గాల ఘర్షణ... పలువురికి గాయాలు