ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అబ్బురపరుస్తున్న 17.5 అంగుళాల పుంగ‌నూరు ఆవు దూడ - Punganur cow calf born to Kapila cow

గుంటూరు జిల్లా రేపల్లెలో క‌పిల జాతి ఆవుకు పుంగ‌నూరు జాతి ఆవు దూడ జ‌న్మించింది. ఈ దూడ 17.5 అంగుళాల ఎత్తు ఉంది. దూడను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు.

Punganur cow calf
పుంగ‌నూరు ఆవు దూడ

By

Published : Jul 5, 2021, 4:35 PM IST

పుంగ‌నూరు ఆవు దూడ

గుంటూరు జిల్లా రేపల్లెలో.. క‌పిల జాతి ఆవుకు పుంగ‌నూరు జాతి ఆవు దూడ జ‌న్మించింది. స్థానిక 15వ వార్డ్​లోని కోగంటి వరప్రసాద్ తన పెరట్లో ఆవులను పెంచుకుంటున్నారు. వాటిల్లో జహీరాబాద్ పొట్టి జాతికి చెందిన 3.5 అడుగుల ఎత్తులో ఉండే కపిల ఆవుకు ఈ దూడ పుట్టింది. తొలిసారి ఈతలో పుంగనూరు జాతి దూడ పుట్టింది. వరప్రసాద్ ఇంటివద్ద పశువుల పాకలో 20 ఆవులను పెంచి పోషిస్తున్నారు.

అందులో ఒంగోలు, గిర్రు, సాహివాల్, టార్ పార్కర్, కాంక్రీజ్, కపిల జాతికి చెందిన ఆవులు ఉన్నాయి. అయితే.. 15.6 అంగుళాల ఎత్తులో పుంగనూరు జాతికి చెందిన దూడ ఇప్పటి దాకా లింకా బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కాగా.. 17.5 అంగుళాల సైజులో దూడలు అరుదుగా కనిపిస్తాయని పశువైద్యులు చెబుతున్నారు. చుట్టుపక్కల వారు ఈ బుజ్జి దూడను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details