కృష్ణమ్మ వరదతో పులిచింతల గరిష్ట సామర్థ్యానికి చేరువైంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ఇప్పటివరకు 36.9 టీఎంసీ నిల్వ ఉంది. నాగార్జునసాగర్ నుంచి 5 లక్షల 49 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా.. మొత్తం 11 గేట్లు తెరిచి సుమారు 3 లక్షల 69వేల క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీకి వదులుతున్నారు. కృష్ణమ్మ వరదతో పులిచింతలకు రికార్డుస్థాయిలో నీరు చేరుతోంది. ప్రాజెక్టు పరిధిలోని బోధనం, కొల్లూరు, పులిచింతల, కేతవరం, చిట్యాల గ్రామాలు ముంపులో ఉన్నాయి. ఆయా గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. ఎమ్మోజిగూడెంలోకి నీరు రాగా... స్థానికులను అక్కడి నుంచి తరలించారు. మాచవరం మండలంలోని గోవిందాపురం, వెల్లంపల్లి, రేగులగడ్డ గ్రామాలకు వరద ముప్పు ఉంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు అందాలను చూసేందుకు కృష్ణ, గుంటూరు.. తెలంగాణలోని నల్లగొండ, సూర్యాపేట జిల్లాల నుంచి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.
పులిచింతలకు కొనసాగుతున్న వరద
పులిచింతల జలాశయానికి కృష్ణమ్మ వరద కొనసాగుతోంది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
పులిచింతల