గుంటూరు జిల్లా పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో మొసళ్లు హడలెత్తిస్తున్నాయి. ఏకంగా ఐదు మొసళ్లు ప్రాజెక్టు దిగువ భాగంలో సంచరిస్తున్నాయి. వీటిని ప్రాజెక్లు సిబ్బంది చరవాణుల్లో బంధించారు. ఇటీవల ఎగువ నుంచి వచ్చిన వరదలతో మొసళ్లు కొట్టుకొచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. సందర్శకులు నదిలో దిగకుండా.. నదీ పరివాహక ప్రాంతాల్లో సంచరించకుండా బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. మొసళ్ల తరలింపుపై అధికారులు త్వరలో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.
పులిచింతల రిజర్వాయర్లో మొసళ్లు..భయాందోళనలో సందర్శకులు - crocodiles
పులిచింతల జలాశయంలో మొసళ్ల సంచారం సందర్శకులను ఆందోళనకు గురి చేస్తోంది. ఐదు మొసళ్లు ప్రాజెక్లులో ఉన్నట్లు తెలుస్తోంది.
పులిచింతల