ప్రశ్నించే గొంతుకలను జగన్మోహన్రెడ్డి అక్రమంగా అరెస్టు చేయిస్తున్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ధ్వజమెత్తారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు ఓ సిగ్గుమాలిన చర్య అని ఆయన మండిపడ్డారు. సంగం డెయిరీని నిర్వీర్యం చేసేందుకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు.
ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు - narendra kumar latest news
సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. నరేంద్రను వెంటనే విడుదల చేయాలంటూ సంగం డెయిరీ కార్యాలయం ముందు కార్మికుల ధర్నా చేపట్టారు. సంగం డెయిరీని నిర్వీర్యం చేసేందుకు జగన్ కుట్ర పన్నారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు ఆరోపించారు.
ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా నిరసనలు
అక్రమంగా అరెస్టు చేసిన తమ ఛైర్మన్‌ను వెంటనే విడుదల చేయాలంటూ సంగం డెయిరీ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా చేపట్టారు. ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టుకు నిరసనగా సంఘం అధ్యక్షులు, వేతన కార్యదర్శులు , పాల ఉత్పత్తి దారులు సిబ్బంది వినుకొండ - నరసరావుపేట జాతీయ రహదారిపై గల పాలశీతలీకరణ కేంద్రం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఇదీ చదవండి:తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్