ప్రభుత్వ ఆసుపత్రులు పనితీరులోనే కాదు వసతులు కల్పించడంలోనూ రోగులను ఇబ్బందులకు గురి చేస్తోందని ఎన్ఎస్యూఐ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో గుంతలు ఏర్పడి రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యను పరిష్కరించాలని అధికారులు, ఆసుపత్రి సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని వివరించారు. అందుకే తామే స్వయంగా గుంతలు పూడ్చి నిరసన తెలియజేసినట్లు వివరించారు.
GGH: జీజీహెచ్‌లో గుంతలు..పట్టించుకోని అధికారులు..ఎన్ఎస్యూఐ నిరసన - వైద్య ఆరోగ్యశాఖ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు అంతంతమాత్రంగా ఉన్నాయన్నారు ఎన్ఎస్యూఐ నాయకులు. వైద్యం కోసం వచ్చేవారు పలు పాట్లు పడుతున్నారని వాపోయారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఉన్న గుంతలను పూడ్చి నిరసన తెలిపారు.
జిజిహెచ్ లో గుంతలు పూడ్చి.. నిరసన
ఇప్పటికైనా అధికారులు స్పందించి జీజీహెచ్‌లోని గుంతలకు మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: గాడిదల సంచారంపై గ్రామస్థుల వినూత్న నిరసన