మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో అమరావతి పరిరక్షణ ఐకాస నేతలు, కార్యకర్తలు... నిరసన దీక్ష నిర్వహించారు. 50 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని దీక్షలో పాల్గొన్న తెదేపా నేత పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని సమస్యతో ఎటువంటి పండగలు, పెళ్లిళ్లు జరగడం లేదని ఆమె అన్నారు. స్వామీజీలకు రాజకీయాలతో పని ఏమిటని నిలదీశారు. అసమర్థ నిర్ణయాలతో భవిష్యత్ తరాలు నష్టపోతాయని రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి అన్నారు.
'అసమర్థ నిర్ణయాలతో భవిష్యత్ తరాలకు నష్టం' - latest updates farmers issue
అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా ధ్యాన బుద్ధ ప్రాజెక్ట్ వద్ద రాజధాని పరిరక్షణ ఐకాస నేతలు నిరసన దీక్ష చేపట్టారు. తెదేపా నేతలు నన్నపనేని రాజకుమారి, పంచుమర్తి అనురాధ, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ పాల్గొన్నారు.
నిరసన చేస్తున్న తెదేపా నేతలు