గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తెనాలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 337 గ్రామ పంచాయతీల్లో మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. పోటీ చేయనున్న సర్పంచ్, వార్డు అభ్యర్థులు పంచాయతీ కార్యాలయాల నుంచి నామినేషన్ పత్రాలను తీసుకెళ్లనున్నారు.
మందకోడిగా పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు - గుంటూరు తాజా న్యూస్
పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. గుంటూరు జిల్లాలో తొలివిడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు మందకోడిగా సాగిన నామినేషన్ల ప్రక్రియ.. శని, ఆదివారాల్లో జోరందుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
చాలాచోట్ల అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో.. తొలిరోజు మందకోడిగా నామినేషన్ల ప్రక్రియ సాగింది. శని, ఆదివారాల్లో ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కోసం 357 మంది స్టేజ్వన్ ఆఫీసర్లను నియమించినట్లు అధికారులు పేర్కొన్నారు.
పంచాయతీ కార్యాలయాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వంద మీటర్ల అవతలే వాహనాలు నిలిపివేస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.