గుంటూరు నగరంలోని కంటైన్మెంట్ ప్రాంతాల్లో నివసించే ప్రజలు నిత్యావసరాల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంచార విక్రయ కేంద్రాల ద్వారా కూరగాయలు, నిత్యావసరాలు అందిస్తున్నా.. అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయని స్థానికులు చెబుతున్నారు. ఫలితంగా మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రెడ్ జోన్ ప్రాంతాలతో ఎలాంటి దుకాణాలు తెరవటం లేదు. మందుల దుకాణాలు, పాల దుకాణాలు సైతం తెరవనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పోలీసులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
నిత్యావసరాల కోసం రెడ్‌జోన్ ప్రాంత వాసుల ఇక్కట్లు - continment
రాష్ట్ర వ్యాప్తంగా అధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు రెడ్‌జోన్‌గా గుర్తించారు. ఫలితంగా ఆ ప్రాంతంలో రాకపోకలను నిషేధించారు. అయితే ఆ ప్రాంతంలో నివాసముండే ప్రజలకు నిత్యావసరాలను ఇంటికే అందిస్తున్నారు అధికారులు. కానీ ఇవి కొన్ని ప్రాంతాలకే పరిమితమవడంతో మిగతా కాలనీల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
గుంటూరులో రెడ్‌జోన్ ప్రకటిత ప్రాంతం