గుంటూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు నిరసన దీక్ష చేపట్టారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. కుటుంబ పోషణ కష్టమై 12 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్నారని పాఠశాల మహిళా కన్వీనర్ శైలజా రాణి అన్నారు.
'ప్రైవేట్ ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదుకోవాలి' - problems on private teachers
కరోనాతో ఉపాధి లేక కష్టాల్లో ఉన్నామని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు వాపోయారు. తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
గుంటూరులో ప్రభుత్వం ఉద్యోగుల నిరసన
మూడు నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడిన ఉపాద్యాయులకు రూ.10 వేల చొప్పున నగదు సాయం చేయాలని ప్రైవేట్ పాఠశాల వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఉపాధ్యాయులను ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: తూర్పుగోదావరి, శ్రీకాకుళం మధ్య చీలిక గుర్తింపు