తెదేపా శ్రేణులపై దాడులు చేయటం సరికాదని మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు అన్నారు. బుధవారం పట్టణంలోని సబ్జైల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలను ఆయన పరామర్శించారు. ఏడ్వర్ట్ పేట, పెట్లూరివాయిపాలెం, ఉప్పలపాడు గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలను జైల్లో పెట్టడం ప్రస్తుత అరాచక పాలనకు నిదర్శనమని కోడెల అన్నారు. వైకాపా గెలిస్తే.. పరిపాలన చేసుకోవాలని, అంతేకానీ తెదేపా కార్యకర్తలపై దాడులు, శిలాఫలకాల ధ్వంసం సరికాదన్నారు. పోలీస్ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని చిన్నాపెద్దా, ఆడామగా... అనే తేడా లేకుండా ఇబ్బందులు పెట్టడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. తెదేపా కార్యకర్తలను గ్రామాల నుంచి వెళ్లిపోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారం ఎప్పటికీ ఉండదన్నారు. అందరూ సమష్టిగా ముందుకెళితేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. ఎవరికి ఎప్పుడు ఎటువంటి కష్టమొచ్చినా అండగా ఉంటానని.. కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
అధికారం శాశ్వతం కాదు: మాజీ స్పీకర్ కోడెల
"అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. గెలిస్తే పరిపాలించుకోవచ్చు... అంతేకానీ పాలనను పక్కనబెట్టి తెదేపా శ్రేణులను భయబ్రాంతులకు గురిచేయటం సరికాదు. పోలీసులైతే మరో అడుగు ముందుకేసి... తెదేపా కార్యకర్తలు గ్రామాల నుంచి వెళ్లిపోవాలని బెదిరించటం దారుణం." - కోడెల శివప్రసాద రావు, మాజీ సభాపతి
అధికారం శాశ్వతం కాదు: మాజీ స్పీకర్ కోడెల