గుంటూరు రాష్ట్ర మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద పోషణ అభియాన్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. కాంట్రాక్టు పద్దతిలో తీసుకున్న ఉద్యోగులను సమయం గడవక ముందే విధులలో నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 340 మంది ఉద్యోగులను విధులలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోషణ అభియాన్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వెళ్తే పోలీసులు అనుమతి ఇవ్వలేదని మహేష్ అనే పోషణ అభియాన్ ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గుంటూరు రాష్ట్ర మహిళ అభివృద్ధి, శిశు సంక్షమశాఖ డైరెక్టర్ కార్యాలయం వద్ద పోషణ అభియాన్ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు.
సీఎం క్యాంపు కార్యాలయం వద్ద పోషణ అభియాన్ ఉద్యోగి ఆత్మహత్యయత్నం
సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు వెళితే పోలీసులు అనుమతి ఇవ్వలేదని మహేష్ అనే ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మరో వ్యక్తి సృహ తప్పి పడిపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమను విధులలోకి తీసుకునే వరకు పోరాటం ఆగదని పోషణ అభియాన్ ఉద్యోగులు హెచ్చరించారు.
ఇదీ చూడండి.
ప్రధాని 70వ పుట్టినరోజు సందర్భంగా 'సేవా సప్తాహం'
Last Updated : Sep 15, 2020, 7:47 AM IST