విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించనుండటంపై.. గుంటూరులో వివిధ రాజకీయపక్షాలు, ప్రజాసంఘాల నేతలు భగ్గుమన్నారు. ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ చేబుల్ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 10న కలెక్టరేట్ ఎదుట అన్ని పార్టీలు ధర్నా చేపట్టాలని తీర్మానించారు.
ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది బలిదానం చేసిన చరిత్ర ఉందని.. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానానికి సంబంధించిన అంశమని వక్తలు అభిప్రాయపడ్డారు. కర్మాగారాన్ని కాపాడుకుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై సభలో చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వెనక్కి తగ్గకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.