ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లాక్​డౌన్​లో పోలీసుల చేతివాటం - గుంటూరులో కరోనా వార్తలు

కరోనా కష్టకాలంలో ఫ్రంట్ వారియర్స్ సేవలు మరవలేనివి. కానీ ఆ పోలీసుశాఖలోని కొంతమంది లాక్​డౌన్​ను వాడుకుని ప్రజలనుంచి ఎక్కువ నగదును వసూలు చేస్తున్నారు. కొందరు సిబ్బంది చలానా పేరుతో జేబులు దండుకుంటున్నారని స్తానికులు తెలిపారు.

guntur
డబ్బులు అడుగుతున్న పోలీసులు

By

Published : May 17, 2021, 6:13 PM IST

లాక్‌డౌన్‌ పోలీసు శాఖలో కొందరికి ఆదాయ వనరుగా మారింది. పట్టణంలో మధ్యాహ్నం 12 గంటలకు దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. తర్వాత ఎవరూ బయటకు రావద్దని సూచించారు. అయితే అత్యవసర పనులపై వచ్చే ప్రజలను నిలిపి పోలీసులు అందినకాడికి గుంజుకుంటున్నారు. ఆయా పోలీసు స్టేషన్లపరిధిలో కొందరు సిబ్బంది ప్రధాన రహదారుల్లో మకాం వేసి రెండు వాహనాలకు చలానా రాస్తే ఐదు వాహనాలను అనధికారికంగా ముడుపులు తీసుకుని పంపుతున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే తంతు రహదారులపై కొనసాగుతోంది. కొందరు సిబ్బంది ప్రైవేటు వ్యక్తులను ఏర్పాటు చేసుకుని ద్విచక్ర వాహనాలకు 300, కార్లకు 500 అనధికారికంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయాన్ని డీఎస్పీ విజయభాస్కరరావు దృష్టికి తీసుకెళ్లగా విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details