గుంటూరు జీజీహెచ్ వద్ద విధులు నిర్వహించే పోలీసులకు ఎట్టకేలకు వసతి సమకూరింది. రోడ్డు ప్రమాదాలు, మెడికో లీగల్ కేసులకు సంబంధించి చికిత్స కోసం వచ్చే వారి వివరాలు నమోదు చేసుకునేందుకు.. జీజీహెచ్ వద్ద నిత్యం పోలీసులు ఉంటారు. అయితే వారికి సరైన వసతి లేక ఇబ్బంది పడే వారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి విజ్ఞప్తి మేరకు జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి.. ఆసుపత్రి ప్రాంగణంలోనే స్థలం కేటాయించారు. దాతల సహకారంతో అవుట్ పోస్టు నిర్మించారు. ఎస్పీ అమ్మిరెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి అవుట్ పోస్టును నేడు ప్రారంభించారు. ఈ అవుట్ పోస్టు ద్వారా పోలీసులకు మెరుగైన వసతి సమకూరిందని ఎస్పీ అమ్మిరెడ్డి అన్నారు.
పోలీసులకు సమకూరిన వసతి.. జీజీహెచ్ వద్ద అవుట్ పోస్ట్ ప్రారంభం - గుంటూరు జీజీహెచ్ వద్ద అవుట్ పోస్ట్ ప్రారంభం వార్తలు
గుంటూరు జీజీహెచ్ వద్ద విధులు నిర్వహించే పోలీసులకు.. వసతి సమకూరింది. మెడికో లీగల్ కేసులకు సంబంధించి చికిత్స కోసం వచ్చే వారి వివరాలు నమోదు చేసుకునేందుకు.. జీజీహెచ్ వద్ద నిత్యం పోలీసులు ఉంటారు. వారి కోసం ఆస్పత్రి ప్రాంగణంలోనే స్థలాన్ని కేటాయించి.. అవుట్ పోస్టును నిర్మించారు.
ggh outpost