ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మగ పిల్లలు లేరని బాలుడు కిడ్నాప్..చివరకు..!

గత నెల 30న మంగళగిరి మండలం ఆత్మకూరులో అపహరణకు గురైన బాలుడు బాలుడిని అపహరించిన నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మగపిల్లాడి కోసం బాలుడిని నాగార్జున అనే వ్యక్తి కిడ్నాప్‌ చేయించాడని పోలీసులు వెల్లడించారు. కిడ్నాప్​ కేసులో నలుగురిని అరెస్టు చేశామని.. ప్రధాన నిందితుడు నాగార్జున పరారీలో ఉన్నట్లు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

కిడ్నాప్
కిడ్నాప్​

By

Published : Oct 8, 2021, 11:04 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలో కిడ్నాప్​ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్​న​కు గురైన 9నెలల బాలుడిని పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని అపహరించిన నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ తెలిపారు.

మగ పిల్లాడి కోసం..

నలుగురు ఆడపిల్లలు ఉన్న నాగార్జున అనే వ్యక్తి .. మగ పిల్లవాడి కోసం రూ. 50వేలు ఇచ్చి.. బాలుడుని కిడ్నాప్ చేయించినట్లు ఎస్పీ వివరించారు. కిడ్నాప్​నకు ప్రధాన కారణమైన నాగార్జున ప్రస్తుతం పరారీలో ఉన్నారని తెలిపారు. కిడ్నాప్​లో పాల్గొన్న నిందితుల వివరాలను మీడియాకు వివరించారు.

ఎలా కిడ్నాప్​ చేశారంటే..

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం కాలువ కట్టపైన మక్కల తిరుపతమ్మ - పరిమి దంపతులు చిన్న గుడిసె వేసుకుని నివాసం ఉంటున్నారు. చెత్తకాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి నలుగురు మగపిల్లలు, ఒక్క అమ్మాయి ఉంది. సెప్టెంబర్​ 30వ తేదీ రాత్రి రోజు మాదిరిగానే భోజనం చేసి పడుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు వచ్చి చిన్న కుమారుడు మక్కల క్రిష్ కుమార్​ను ఎత్తుకెళ్తున్న క్రమంలో.. తండ్రి పరిమికి మెలుకువ వచ్చి అడ్డుకున్నాడు. దుండగులు అతనిపై దాడి చేసి ద్విచక్రవాహనంపై పరాయ్యారు. వెంటనే తల్లిదండ్రులు.. మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్​ను పరిశీలించి నిందితులు కోసం గాలింపు చేపట్టారు.

ఆ భయమే పట్టించింది..

బాలుడు అపహరణకు గురైనట్లు వార్తలు మీడియాలో రావడంతో నిందితుడికి భయం వేసింది. ఆ భయమే నిందితులను పట్టించింది.

మగపిల్లోడు లేడని నిరాశకు గురై..

క్రోసూరు మండలానికి చెందిన నాగార్జున ముఠామేస్త్రిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి నలుగురు అమ్మాయిలు. మగపిల్లాడు లేకపోవడంతో నిరాశకు గురై.. మగపిల్లాడి కోసం అన్వేషణ సాగించాడు. ఈ విషయాన్ని అతడు..బంధువైన తిరుపతి రామాంజనేయులుకు చెప్పాడు. అందుకు తిరుపతి సరేనన్నాడు. ఈ క్రమంలో మంగళగిరిలో కూలి పని చేస్తున్న నాగరాజుకు.. తిరుపతి విషయం చెప్పారు. ఓ చోట పిల్లోడు ఉన్నాడని కిడ్నాప్​ చేస్తానని తిరుపతికి నాగరాజు చెప్పాడు. అందుకు రూ.50 వేలకు ఇవ్వాలని తిరుతికి తెలిపాడు. ఈ విషయాన్ని తిరుపతి..అసలు నాగార్జునకు తెలపగా సరేనన్నాడు.

ప్రణాళిక ప్రకారం బాలుడుని కిడ్నాప్ చేయడానికి నాగరాజు.. తిరుపతి, ఓ మైనర్​ , కొండమ్మ అనే మహిళ సాయం తీసుకున్నాడు. ప్లాన్​ ప్రకారం క్రిష్ కుమార్ అనే బాలుడిని తెల్లవారుజామున అపహరించుకుని వెళ్లారు. బాలుడిని గుంటూరు.. గుజ్జనగుండ్లలో ఉన్న నాగార్జునకు అప్పగించారు. నాగార్జున..నాగరాజుకు ఫోన్​ పే ద్వారా రూ.46 వేలు చెల్లించాడు. బాలుడిని నాగార్జున వాళ్ళ అత్తకి ఇచ్చి పంపించాడు.

'మరుసటి రోజు నుంచి బాలుడు మిస్ అయ్యాడు' అని వార్తలు రావడంతో నాగార్జునకు భయం వేసింది. దీంతో తిరుపతిని పిలిచి బాలుడుని అతనికి అప్పగించాడు. తిరుపతి పిల్లోడిని పిడుగురాళ్లకు తీసుకెళ్లాడు. అతనికీ భయం వేసి బాలుడిని పిడుగురాల్లోని సున్నపుబట్టీల వద్ద వదిలి వెళ్ళిపోయాడు. సున్నపుబట్టీల వద్ద బాలుడు ఉండడాన్ని చూసిన స్థానికులు పిల్లోడిని పిడుగురాళ్ల పోలీసులకు అప్పగించారు.

పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో నాగరాజు ఫోన్ ట్యాప్ చేసి అతనిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడు పిడుగురాళ్లలో ఉన్నాడని తెలుసుకుని అక్కడకి వెళ్లి బాలుడుని సురక్షితంగా కాపాడి.. అక్కడే ఉన్న తిరుపతిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు నాగరాజు, మైనర్, కొండమ్మను అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్​నకు ప్రధాన కారణమైన నాగార్జున పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులందరూ చుట్టాలు కావడం గమనార్హం.

ఇదీ చదవండి:MISSING : గుంటూరు జిల్లా కొచ్చర్లలో తల్లీకుమారుడు అదృశ్యం

ABOUT THE AUTHOR

...view details