కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారికి పోలీసులు షాక్ ఇస్తున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి పాత టోల్ గేట్ సమీపంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. కొవిడ్ టెస్ట్‌కు వెళ్లి వస్తున్నామని చెప్పిన వారిని బలవంతంగా అంబులెన్స్‌లో క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు.
ఇందుకోసం ఓ అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచారు. పీపీఈ కిట్ ధరించిన ఇద్దరు వ్యక్తులు అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రికి, కొవిడ్ పరీక్షలకు వెళ్లి వస్తున్నామని చెప్పేవారిని కొవిడ్ కేర్ సెంటర్లకు పంపిస్తున్నారు. దీంతో చాలా మంది యువకులు అనవసరంగా బయటకు రావడం తగ్గిందని పోలీసులు తెలిపారు.