అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద గుంటూరు గ్రామీణ పోలీసులు నిఘా ముమ్మరం చేశారు. ఇటీవల పొందుగుల, దాచేపల్లి వద్ద తెలంగాణ నుంచి రాష్ట్రానికి తరలిస్తున్న మద్యాన్ని పెద్దఎత్తున స్వాధీనం చేసుకున్నారు. తాజాగా నాగార్జున సాగర్ అంతర్రాష్ట్ర చెక్ పోస్టు వద్ద 3లక్షల 50వేల రూపాయల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు సీజ్ చేశారు. మినీ వ్యాన్లో కందిపొట్టు బస్తాల కింద గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు గుర్తించి... హైదరాబాద్కు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలేనికి గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ నుంచి తరలిస్తున్న గుట్కా ప్యాకెట్ల సీజ్ - hyderabad gutka seized in guntur dst
హైదరాబాదు నుంచి ప్రకాశం జిల్లా యర్రగొండపాలేనికి గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు గ్రామీణ పోలీసులు నాగార్జున సాగర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేయగా 3లక్షల 50వేల రూపాయల విలువై గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి.
police arrested gutka transported persons in guntur dst