రాజధాని మార్పు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల వ్యవహారంపై ప్రధాన మంత్రి కార్యాలయం(పీఎంవో) ఆరా తీసింది. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న ఈ బిల్లులకు సంబంధించి పీఎంవో వివరాలు కోరింది. హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్ శాస్త్రి రాసిన లేఖపై స్పందించిన పీఎంవో... గవర్నర్ కార్యాలయాన్ని వివరాలు అడిగినట్టు తెలిసింది. ఈ రెండు బిల్లులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు పంపిన ప్రతిపాదనలను ప్రధాని కార్యాలయానికి హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి జి.వి.ఆర్ శాస్త్రి పంపారు. దీనిపైనే పీఎంవో గవర్నర్ కార్యాలయాన్ని వివరాలు అడిగింది.
రాజధాని బిల్లుల వ్యవహారంపై వివరాలు కోరిన పీఎంవో - ఏపీ రాజధాని బిల్లులు తాజా వార్తలు
11:58 July 23
హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి లేఖపై పీఎంఓ స్పందన
రాజధాని ఏర్పాటు కేంద్రం పరిధిలోని అంశం, హైకోర్టు నోటిఫికేషన్ రాష్ట్రపతి ఆమోదం ద్వారా జరిగింది. రాజధాని మార్చడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోం మంత్రికి లేఖలు రాశాం. లేఖపై స్పందించిన ప్రధాని కార్యాలయం మరి కొన్ని వివరాలు అడిగింది. ఆమేరకు వివరాలు కూడా సమర్పించాం- జి.వి.ఆర్ శాస్త్రి
చట్ట ప్రకారం రాజధాని మార్చడం ఎలా సాధ్యం కాదో కూడా పీఎంవో కార్యాలయానికి వివరించామన్నారు. దీనిపై అటార్నీ జనరల్ న్యాయ సలహా కూడా తీసుకోవాలని కేంద్రాన్ని కోరినట్టు చెప్పారు. అమరావతి జేఏసీలోనూ హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి శాస్త్రి కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి