ఓట్ల లెక్కింపు, సిబ్బంది విధుల కేటాయింపు నుంచి తుది ఫలితం అధికారికంగా విడుదలయ్యే వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. జిల్లాలోని 3 పార్లమెంట్, 17 అసెంబ్లీ నియోజకవర్గాలకు కౌంటింగ్ రేపు జరగనుంది. గుంటూరు జిల్లాలో ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు, అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాల జారీ, భద్రత చర్యలు తదితర అంశాలపై కలెక్టర్ కోన శశిధర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
తుది ఫలితం వచ్చే వరకు పటిష్ఠ చర్యలు: కలెక్టర్ - కోన శశిధర్
గురువారం జరిగే ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రత, సిబ్బంది విధుల కేటాయింపు, ఏజెంట్ల మార్గదర్శకాలపై కలెక్టర్ కోన శశిధర్ స్పష్టత నిచ్చారు.
కలెక్టర్ కోన శశిధర్