వైకాపా అరాచక పాలనకు డాక్టర్ సుధాకర్ పరిస్థితే నిదర్శనమని తెదేపా రాష్ట్ర కార్యదర్శి పిల్లి మాణిక్యాలరావు అన్నారు. ఏడాది పాలన అరాచకాలు, అక్రమాలతోనే గడిచిందని ఆగ్రహించారు. కరోనా కట్టడిలో ముందుండి పోరాడుతున్న వైద్యులు మాస్క్ అడిగిన పాపానికి.. డాక్టర్ సుధాకర్ ను పిచ్చివాడిగా చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నించాడనే కారణంతో పిచ్చి వాడిగా ముద్ర వేసి మెంటల్ హాస్పిటల్ కు పంపించడం దారుణమన్నారు.
ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే.. ప్రజాగ్రహంతో వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుందని హెచ్చరించారు. దళితుల పక్షపాతి అని చెప్పుకుంటున్న వైకాపా నేతలు డాక్టర్ సుధాకర్ విషయంలో ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారో చెప్పాలన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందిస్తే స్వాగతిస్తామని .. లేని పక్షంలో ప్రజా ఆగ్రహ జ్వాలలో వైకాపా ప్రభుత్వం భూస్థాపితం అవుతుందని హెచ్చరించారు.