తితిదే ఆస్తుల వేలం ప్రక్రియను నిలిపివేయాలని కోరుతూ అనంతపురంకు చెందిన భాజపా నేత జంగటి అమర్నాథ్ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 2016 లో నిర్ణయించిన 50 ఆస్తుల వేలాన్ని మాత్రమే ప్రభుత్వం నిలిపివేసిందని, మరో 23 ఆస్తులు వేలం వేసేందుకు తితిదే సన్నాహాలు చేస్తోందని పిటీషనర్ తెలిపారు. భవిష్యత్‌లోనూ ఆస్తులు వేలం వేయకుండా చర్యలు తీసుకోవాలని, ఆస్తులను రక్షణకు జ్యుడీషియల్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
తితిదే ఆస్తుల వేలం నిలిపివేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం
తితిదే నిర్ణయించిన దేవస్థానం ఆస్తుల వేలం ప్రక్రియపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ప్రక్రియను నిలిపివేయాలని అనంతపురంకు చెందిన భాజపా నేత అమర్నాథ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో పిల్ దాఖలు చేశారు.
తితిదే ఆస్తుల వేలంను నిలిపివేయాలంటూ హైకోర్టులో వ్యాజ్యం