'మళ్లీ బాబే సీఎం కావాలి' - galla
ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలంటూ... గుంటూరులో విభిన్న ప్రతిభావంతులు ర్యాలీ చేపట్టారు. తమకు ప్రభుత్వం మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఇచ్చినందుకు... ఫించను 3000 రూపాయలు పెంచినందుకు కృతజ్ఞతగా యాత్ర చేపట్టారు.
ముఖ్యమంత్రిగా మళ్లీ చంద్రబాబే రావాలంటూ... గుంటూరులో విభిన్న ప్రతిభావంతులు ర్యాలీ చేపట్టారు. తమకు ప్రభుత్వం మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాలు ఇచ్చినందుకు... ఫించను 3000 రూపాయలు పెంచినందుకు కృతజ్ఞతగా యాత్రచేపట్టారు. ఎంపీ గల్లా జయదేవ్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం బృందావన్ గార్డెన్స్ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మూడు చక్రాల వాహనాలపై ర్యాలీగా బయలుదేరారు. ప్రజలకోసం నిత్యం శ్రమించే మనిషి సీఎం చంద్రబాబునాయుడని గల్లా తెలిపారు. 150 మందికి పైగా విభిన్న ప్రతిభావంతులు, తెదేపా నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.