ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెట్రోల్ ట్యాంకర్-క్రేన్ ఢీ... ఒకరికి తీవ్ర గాయాలు - guntur district crime news

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం సమీపంలోని నక్క వాగు వద్ద బుధవారం రాత్రి పెట్రోల్ ట్యాంకర్​ను క్రేన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం పెట్రోల్ లీక్ అవుతుండటంతో... పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఇంధనాన్ని తగు జాగ్రత్తలతో బయటకు తీశారు.

petrol tanker accident in thtimmapuram guntur district
పెట్రోల్ ట్యాంకర్-క్రేన్ ఢీ... ఒకరికి తీవ్ర గాయాలు

By

Published : Mar 17, 2021, 11:01 PM IST

గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు 16వ నంబర్ జాతీయ రహదారిపై వస్తున్న ఆయిల్ ట్యాంకర్​ను యడ్లపాడు పరిధిలోని నక్క వాగు సమీపంలో క్రేన్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండటంతో.. అప్రమత్తమైన పోలీసులు జాతీయ రహదారిపై వన్ వే అమలు చేసి ట్రాఫిక్​ను మళ్లించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది పెట్రోల్ ట్యాంకర్​ను సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి లీక్ అవుతున్న పెట్రోల్​ను బయటకు తీశారు.

ABOUT THE AUTHOR

...view details