గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎన్నిక రద్దు చేయాలంటూ... మంత్రి మోపిదేవి వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్యప్రసాద్ అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న ఆయన... అఫిడవిట్‌లో వృత్తి గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. తప్పుడు సమాచారం పొందుపరిచినందుకు అతని ఎన్నిక రద్దు చేయాలని... తదుపరి ఎక్కువ ఓట్లు వచ్చిన తనను ఎమ్మెల్యేగా ప్రకటించేలా ఆదేశించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
సత్యప్రసాద్ ఎన్నిక రద్దు చేయాలని పిటిషన్ - guntur news
రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఎన్నిక రద్దు చేయాలంటూ... మంత్రి మోపిదేవి వెంకటరమణ హైకోర్టును ఆశ్రయించారు.
అనగాని సత్యప్రసాద్