మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబ సభ్యులపై సత్తెనపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యాపారి గుంటూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017లో నర్సరావుపేటలో జరిగిన ఖేలో ఇండియా క్రీడా పోటీల సందర్భంగా... భోజనాలు సరఫరా చేసిన బిల్లులు మంజూరు చేసేందుకు తన వద్ద నుంచి రూ.11లక్షలు వసూలు చేశారని శ్రీనివాస్ ఆరోపించారు. గుంటూరులోని కోడెల శివరాంకు చెందిన గౌతం షోరూంకు పిలిచి తనపై దాడి చేశారని తెలిపారు. ఈ విషయంపై అర్బన్ ఎస్పీ రామకృష్ణకు ఫిర్యాదు చేసినట్లు శ్రీనివాస్ చెప్పారు.
కోడెల కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు - కోడెల శివప్రసాదరావు
శాసనసభ మాజీ సభాపతి కోడెల కుటుంబ సభ్యులపై సత్తెనపల్లికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గుంటూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
శ్రీనివాస్
Last Updated : Jun 15, 2019, 9:49 PM IST