ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేరేచర్లలో హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుడు అరెస్ట్ - మేడికొండూరు వార్తలు

వాళ్లిద్దరూ బతుకుదెరువు కోసం ఒడిశా నుంచి వచ్చారు. గుంటూరు జిల్లా పేరేచర్లలో భవన నిర్మాణ పనులు చేసేవారు. రూ.500 విషయంలో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అదే ఒకరి ప్రాణాలు తీసింది. మరొకరిని జైలు పాలు చేసింది. గత నెల 13న జరిగిన హత్యకేసును ఛేదించిన మేడికొండూరు పోలీసులు.. ఈ వివరాలు వెల్లడించారు.

person arrested in murder case
పేరేచర్ల హత్యకేసును ఛేదించిన పోలీసులు

By

Published : Dec 26, 2020, 4:05 PM IST

గుంటూరు జిల్లా పేరేచర్ల వద్ద గత నెల 13న జరిగిన హత్యకేసును మేడికొండూరు పోలీసులు ఛేదించారు. మృతుడు ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా జోధబందకు చెందిన సుకుంటా నాయక్​గా గుర్తించారు. ఈ కేసులో అదే రాష్ట్రానికి చెందిన కృష్ణచంద్ర నాయక్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఆధారాలు ఏమీ లేకున్నా కేవలం ఫోన్ కాల్స్ ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.

గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి కేసు గురించిన విషయాలు వివరించారు. ఒడిశా నుంచి ఉపాధి కోసం వచ్చిన వీరిద్దరు పేరేచర్లలో భవన నిర్మాణ పనులు చేసేవారు. రూ.500 కోసం ఇద్దరి మధ్య ఏర్పడిన వివాదమే హత్యకు దారితీసిందని ఎస్పీ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details