ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాకు సరకులు అందడం లేదు.. అధికారులేం చేస్తున్నారు?' - guntur dst redzons problems

గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను అధికారులు రెడ్ జోన్ గా కొనసాగిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు.. తమకు సరకులు సమయానికి అందడం లేదని ఆవేదన చెందుతున్నారు.

people in guntur dst redzone facing problems due to no food
people in guntur dst redzone facing problems due to no food

By

Published : May 12, 2020, 12:42 PM IST

గుంటూరులో కరోనా కేసులు నమోదైన ప్రాంతాల్లో సరకుల పంపిణీ సరిగా లేదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాజిటివ్ కేసులు నమోదైన చాలా ప్రాంతాల్లో నెల రోజులకు పైగా సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగుతోంది. 28 రోజుల పాటు కేసులు నమోదు కాకపోతే రెడ్ జోన్ ఎత్తేయవచ్చు. కానీ... సమీపంలోని ఏదో ఒక ప్రాంతంలో కేసులు నమోదవుతున్నాయి.

ఈ కారణంగా.. రెడ్ జోన్ నుంచి మారే పరిస్థితి కనిపించటం లేదు. ఫలితంగా.. కంటైన్మెంట్ ప్రాంతాల్లో నివసించే వారు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరకులు ఇళ్ల వద్దకు పంపిస్తామని అధికారులు చెబుతున్నా ఆ పని సరిగా జరగటం లేదని వాపోతున్నారు. తాము ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటు.. ఎవరూ సరిగా స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details