లాక్డౌన్ కారణంగా నగరంలోని పండ్ల మార్కెట్‌ను ఏటుకూరు రహదారి పక్కన ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకే క్రయవిక్రయాలు చేస్తున్నారు. ఫలితంగా ఆ సమయంలో విపరీతమైన రద్దీ నెలకొంటోంది. వాహనాలన్నీ ఒకేసారి మార్కెట్లోకి వస్తున్నకారణంగా అదుపు చేయడం సిబ్బందికి ఇబ్బందిని కలిగిస్తోంది. వ్యాపారుల్లో చాలామంది మాస్కులు ధరించటం లేదు. కరోనా వ్యాప్తికి ఈ పరిస్థితులు దోహదం చేసే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు.
పండ్ల కొనుగోలు సరే.. భౌతిక దూరం వద్దా? - గుంటూరు జిల్లాలో లాక్డౌన్ ప్రభావం
లాక్ డౌన్ కారణంగా నిత్యవసర సరుకుల క్రయవిక్రయాలను పరిమిత వేళల్లోనే అనుమతిస్తున్నారు. ఫలితంగా.. ఆ వేళల్లో రద్దీ పెరిగి అసలుకు ఎసరు తెచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గుంటూరు సమీపంలో ఏర్పాటు చేసిన పండ్ల మార్కెట్ లో ఇప్పుడు ఇదే వాతావరణం... జనాన్ని కలవరపరుస్తోంది.
గుంటూరు పండ్ల మార్కెట్లో గుమిగూడిన ప్రజలు, వ్యాపారులు