Traffic Problem due to Hoarding: ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత జన్మదినం సందర్భంగా ఈ నెల 25వ తేదీన ఏర్పాటు చేసిన భారీ హోర్డింగు వలన వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే అమరావతి రోడ్డులో ఇన్నర్‌రింగ్ రోడ్డు కూడలి వద్ద దీనిని ఏర్పాటు చేశారు. భారీ వాహనాలు లోడుతో వెళ్లాలంటే.. వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మహనీయుల విగ్రహాలని ఏర్పాటు చేయడానికి.. ఆంక్షలు పెట్టే అధికారులకు.. హోర్డింగ్ కనిపించడం లేదా అని ప్రజలు మండిపడుతున్నారు.
ఠారెత్తిస్తున్న హోర్డింగ్ లు.. సంబరాలు అయిపోయినా పట్టించుకోని అధికారులు - హోర్డింగు కారణంగా ప్రజల ఇబ్బందులు
Traffic Problem due to Hoarding: రోడ్డు మధ్యలో ఉన్న భారీ హోర్డింగు.. ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోంది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే సుచరిత జన్మదినం సందర్భంగా భారీ హోర్డింగ్‌ను ఏర్పాటు చేశారు. అది కాస్తా రోడ్డు మధ్య వరకూ ఉంది. నిత్యం రద్దీగా ఉండే కూడలిలో ఏర్పాటు చేయడం వలన భారీ వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది.
హోర్డింగు తెచ్చిన కష్టాలు