Pawan Reached To Delhi For NDA Meeting: మంగళవారం దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి భేటీ జరగబోతుంది. ఈ భేటీకి ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలకు బీజేపీ పెద్దల ఆహ్వానాలు పంపించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ నుంచి ఆహ్వానం లభించింది. దీంతో పవన్‌కల్యాణ్ దిల్లీ చేరుకున్నారు. ఈ భేటీలో పాల్గొనే అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. బీజేపీ సినీయర్ నేతలు తనను ఈ సమావేశానికి ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై చర్చించే అవకాశం ఉందని వివరించారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి మార్గాలపై భేటీలో చర్చించనున్నట్లు వివరించారు. ఎన్డీఏ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చిస్తామని ఆయన వివరించారు.
దిల్లీలో ఎన్డీఏ భేటీ..భారతీయ పార్టీ ఆధ్వర్యంలో జులై 18వ తేదీన దేశ రాజధాని దిల్లీలో జాతీయ ప్రజాస్వామ్య కూటమి భేటీ జరగబోతుంది. ఈ భేటీకి ఎన్డీఏలో భాగస్వాములైన పార్టీల అగ్రనేతలకు బీజేపీ పెద్దల ఆహ్వానాలు పంపించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు బీజేపీ నుంచి ఆహ్వానం లభించింది. ప్రస్తుతానికి జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌కు బీజేపీ అగ్రనాయకత్వం నుంచి పిలుపు అందడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీ ద్వారా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల పొత్తు విషయంపై ఏదైనా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు పార్టీల నేతలు చర్చించుకుంటున్నారు.