తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి …. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పార్టీ తరపున పరిహారం అందించనున్నారు. ఈనెల 4వ తేదీన ఇప్పటం గ్రామంలో అధికారులు రహదారి విస్తరణ పేరిట ఇళ్లు, ఇతర నిర్మాణాలను తొలగించారు. జనసేన ఆవిర్భావ సభకు స్థలం ఇచ్చినందునే ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చివేశారని బాధితులు ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు. ఆ పరిహారాన్ని నేడు అందించనున్నారు. స్వయంగా ఇప్పటం వెళ్లి పరిహారం అందించాలని భావించినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బాధితులను మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పిలిపించి పరిహారం అందించనున్నారు.
ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన వారికి నేడు పరిహారం ఇవ్వనున్న పవన్ - ఏపీ విశేషాలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఇప్పటం గ్రామం ప్రజలతో భేటీ కానున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి పార్టీ తరుపున పరిహారం అందించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బాదితులకు లక్ష రూపాయల చొప్పున పరిహరం అందించనున్నారు.
ఇప్పటంలో నేడు జనసేనాని పర్యటన
Last Updated : Nov 27, 2022, 10:44 AM IST