లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతోన్న వైకాపా సర్కారు... లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేసిందని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా జనసైనికులతో సమీక్షించిన ఆయన... భవన నిర్మాణదారుల సమస్యలను ప్రస్తావించారు. ఇసుక కొరతతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు.
'ప్రభుత్వ తీరుతో భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు' - మంగళగిరిలో జనసేన పవన్ కల్యాణ్
ఇసుక కొరతపై జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ స్పందించారు. ప్రభుత్వ తీరుతో లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డారని ధ్వజమెత్తారు. భవన నిర్మాణదారుల సమస్యలపై పోరాటం చేస్తామని జనసేనాని తెలిపారు.
pawan kalyan comments on ysrcp