కరోనా లాక్డౌన్ కారణంగా 70 రోజుల పాటు సాధారణ వైద్య సేవల్ని నిలిపివేసింది గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్నారై ఆసుపత్రి. ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని గురువారం నుంచి సాధారణ వైద్య సేవలు ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ఉపేంద్రనాథ్ తెలిపారు.
మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో ఓపీ సేవలు పునః ప్రారంభం - మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో ఓపీ సేవలు తిరిగి ప్రారంభం
కరోనా కారణంగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో నిలిపివేసిన ఓపీ సేవలను గురువారం నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ ఉపేంద్రనాథ్ తెలిపారు.
మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో ఓపీ సేవలు తిరిగి ప్రారంభం
జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన కొవిడ్ -19 మార్గదర్శకాలను అనుసరించి ఎన్నారై సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలో అన్ని రకాల సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. ఆస్పత్రికి వచ్చే రోగులు తమ వెంట మాస్క్, ఆధార్ కార్డు తీసుకునిరావాలని ఎన్నారై ఆస్పత్రి కోశాధికారి అక్కినేని మణి చెప్పారు. ఆసుపత్రికి వచ్చే వారు తప్పక నిబంధనలు పాటించాలన్నారు.
ఇదీ చదవండి: కలుషిత ఆహారం తిని 20మందికి అస్వస్థత