ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చూడముచ్చటైన చిత్రాలు... ఆకర్షితులైతే మోసాలు... - mobile

సరికొత్త మోసానికి ఆన్​లైన్ కంపెనీలు తెరలేపాయి. ఆకర్షణీయమైన చరవాణులు తక్కువ ధరకే ఇస్తామని కొన్ని కంపెనీలు నాసిరకం ఫోన్లు కట్టబెడుతుండగా...మరికొన్ని కంపెనీలు డబ్బు తమ ఖాతాలోకి జమచేసుకొని ఉడాయిస్తున్నాయి.

చరవాణి పేరుతో.. ఆన్​లైన్ మోసం

By

Published : May 1, 2019, 10:16 AM IST

ఆన్​లైన్​లో చరవాణి ఇప్పిస్తామంటూ ఓ కంపెనీ డబ్బు జమ చేయించుకొని మోసం చేసిందని గుంటూరుకు చెందిన ఓవ్యక్తి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడుకు చెందిన ప్రసాద్ చరవాణి కొనుగోలు చేసేందుకు ఆన్​లైన్​లో వెతగ్గా... దిల్​మిత్ర అనే సంస్థ తగిలింది. ఓ ప్రఖ్యాత కంపెనీకి చెందిన ఫొటోలను తన వెబ్‌సైట్‌లో ఉంచిందా సంస్థ. వాటిని చూసిన వ్యక్తి... 14 వేలు చెల్లించి ఆ మొబైల్‌ను కొనుగోలు చేశారు. మూడు రోజుల్లో చరవాణి ఇంటికి చేరుస్తామని చెప్పిన సదరు కంపెనీ రోజులు గడుస్తున్నా స్పందించలేదు. మోసపోయామని తెలుసుకున్న ప్రసాద్ ఆన్​లైన్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
ఇదిలా ఉండగా ఆకట్టుకునే రకాలు చెందిన చరవాణులను ఆన్​లైన్​లో ఉంచి నాసిరకం ఫోన్లను అంటగడుతున్న మరో సరికొత్త మోసానికి ఇంకో వ్యక్తి బలయ్యాడు. గుంటూరు నగరంలోని శ్రీనగర్‌కు చెందిన రఘు అనే యువకుడు పాతి వేలలోపు మొబైల్‌ కోసం నెట్‌లో వెతికాడు.
ఆధునిక హంగులతో ఉన్న ఓ ఫోన్​ను తక్కువ ధరకే ఇస్తామని ఇంకో సంస్థ ఆఫర్‌ చూపించింది. వెంటనే 11 వేలు చెల్లించాడు. ఫోన్‌ ఇంటికి పంపించాడు. చూస్తే నాసిరకం ఫోన్‌ వచ్చింది. ఇదేంటని డెలవరీ బాయ్​ని ప్రశ్నిస్తే తనకేం సంబంధం లేదని బదిలిచ్చాడు. గత్యంతరం లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు రఘు.

చరవాణి పేరుతో.. ఆన్​లైన్ మోసం

ABOUT THE AUTHOR

...view details