ఆర్థిక ఇబ్బందులు తాళలేక.. వ్యక్తి ఆత్మహత్య - bhakthisraddalatho ramjaan
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో జరిగింది.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోయవారిపాలెంలో నివసించే దొడ్ల సాంబశివరావు(60) హోటల్ నడుపుతుండేవాడు. ఆర్థిక ఇబ్బందులకు తోడు ఇంట్లో సమస్యలతో బాధపడుతుండేవాడు. సమస్యలు మరింత ఎక్కువ కావటంతో తట్టుకోలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్లే చనిపోయాడని గ్రామస్థులు చెప్తుండగా, ఆయన భార్య మాత్రం సాగులో వచ్చిన నష్టాన్ని తట్టుకోలేకే చనిపోయాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.