ఈత సరదా... యువకుడి ప్రాణం తీసింది - water
సరదా కోసం ముగ్గురు ఈతకు వెళ్తే.. ప్రాణాలమిదకొచ్చింది. స్థానికులు చూసి... రక్షించగా ఇద్దరు మాత్రమే బయటపడ్డారు.
one_man_fell_down_into_water_canal_and_died
గుంటూరు జిల్లా మంగళగిరిలోని కొత్తకాల్వలో ముగ్గురు కలిసి ఈతకు వెళ్లారు. సరదాగా గడపాలనుకున్నారు. కానీ... నీటి ప్రవాహం పెరగిన కారణంగా ముగ్గురూ గల్లంతయ్యారు. రత్నాల చెరువుకు చెందిన మరియబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. యువకులు గల్లంతైన విషయాన్ని గమనించిన స్థానికులు ఇద్దరిని కాపాడారు.