ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ACCIDENT : ద్విచక్రవాహనం-ఇసుక లారీ ఢీ... ఒకరు మృతి - tenali crime

గుంటూరు జిల్లా పెదరావూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనాన్ని ఇసుక లారీ ఢీ కొట్టడంతో బ్యాంకు ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ద్విచక్రవాహనం-ఇసుక లారీ ఢీ
ద్విచక్రవాహనం-ఇసుక లారీ ఢీ

By

Published : Aug 23, 2021, 12:08 AM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్​గా విధులు నిర్వహిస్తున్న తాలూరి నాగప్రసాద్... తన సహ ఉద్యోగి వివాహానికి వెళ్లాడు. వేడుక అనంతరం స్వగ్రామానికి వస్తుండగా పెదరావూరు చెరువు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. నాగప్రసాద్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని... ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో నాగప్రసాద్​కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై తెనాలి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details