ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Murder: గుంటూరులో వడ్డీ వ్యాపారి దారుణ హత్య - గుంటూరు తాజా సమాచారం

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. కొండపాటూరులో ఓ వృద్ధుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించారు.

murder
దారుణ హత్య

By

Published : Aug 24, 2021, 11:11 AM IST

గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరుకు చెందిన వడ్డీ వ్యాపారి మొగిలి కొండయ్య (69)ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. 9 రోజుల క్రితం కుమారుల వద్దకు వెళ్లిన మృతుని భార్య.. ఇంటికి వచ్చి చూడగా రక్తపు మడుగులో తన భర్త ఉండటాన్ని గమనించింది. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చింది. బాపట్ల డీఎస్పీ, సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రవీంద్రబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. డాగ్ స్క్వాడ్, వేలి ముద్రల బృందంతో ఆధారాలను సేకరిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాపట్ల ఆసుపత్రికి తరలించారు. త్వరలోనే హత్య కేసు చేధిస్తామని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details