మూడు రాజధానుల ప్రకటనలతో అమరావతిలో రైతుల ఆందోళనలు ఇంకా కొనసాగుతునే ఉన్నాయి. తమ నిరసనలు ప్రభుత్వం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు మనోవేదనతో చనిపోయారు. బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం చేసేందుకు ఎన్నారైలు ముందుకొచ్చారు. అమెరికాలోని అశ్విన్ మిత్రబృందం 72మంది పేదరైతు కుటుంబాలకు 15లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు ఎన్నారై కాజా రామారావు తెలిపారు. రాజధాని పరిరక్షణ సమితి ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఉద్ధండరాయునిపాలెంలోని శంకుస్థాపన చేసిన ప్రాంతంలో ఆర్థిక సహాయం చేస్తామని ఐకాస కన్వీనర్ పువ్వాడ సుధాకర్ చెప్పారు.
అమరావతి మృతుల కుటుంబాలకు ఎన్నారైల ఆర్థిక సాయం - AP AMARAVATHI NEWS
మూడు రాజధానుల ప్రకటనతో మనోవేదనకు గురై మృతి చెందిన రైతు కుటుంబాలను ఆదుకునేందుకు అమెరికాలోని అశ్విన్ మిత్రబృందం ముందుకొచ్చింది. ఈ నెల 6న ఉద్దండరాయునిపాలెంలో 72 బాధిత కుటుంబాలకు 15 లక్షల ఆర్థికసాయం చేయనున్నారు.
అమరావతిలో మృతి చెందిన బాధిత రైతుల కుటుంబాలకు ఎన్నారైల ఆర్థికసాయం
ఇవీ చదవండి