ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 3, 2020, 4:00 PM IST

ETV Bharat / state

'ఒక్క పాఠశాల కూడా మూయడానికి వీల్లేదు'

పాఠశాలల్లో నాడు- నేడుపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఉపాధ్యాయుల బదిలీలకు అనుమతి తెలిపారు.

cm jagan
cm jagan

రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మూయడానికి వీల్లేదని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అలాగే జులై చివరి నాటికి నాడు- నేడు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పాఠశాలల్లో నాడు- నేడుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో ఏర్పాటు చేయనున్న సదుపాయాలను పరిశీలించారు. ‌సమీక్ష అనంతరం ఈ వివరాలను మంత్రి ఆదిమూలపు సురేశ్...​ మీడియాకు వెల్లడించారు. 'నాడు- నేడుకు మొదటి దశలో 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటికే చాలాచోట్ల పనులు ఊపందుకున్నాయి. ఈ కార్యక్రమం కింద తొలిదశలో 15,700 మౌలిక వసతులు కల్పిస్తున్నాం. దీనికి సంబంధించిన టెండర్లు ఇప్పటికే పూర్తి చేశాం. మొదటి దశలో 500 కొత్తగా జునియర్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నాం. 7,500 కోట్ల రూపాయలు రెండో విడతలో ఖర్చు చేస్తున్నాం. నాడు- నేడుపై సీఎం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఫర్నిచర్ నాణ్యతను పరిశీలించారు. నాడు- నేడు దేశ చరిత్రలోనే నిలిచిపోతుంది. జగన్న గోరు ముద్ద కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నాం' అని మంత్రి సురేశ్ వెల్లడించారు.
ఉపాధ్యాయుల బదిలీకి అనుమతి
ఉపాధ్యాయుల బదిలీలకు సీఎం అనుమతి ఇచ్చారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు త్వరలో బదిలీలు చేపడతామని తెలిపారు. వెబ్ బేస్ కౌన్సిల్ ద్వారా వీటిని చేపడతామని వివరించారు. ఇకపై బదిలీల కోసం ఉపాధ్యాయులు ఎవరిచుట్టూ తిరగనక్కర్లేదని మంత్రి సురేశ్‌ అన్నారు. పదో తరగతి పరీక్షలు అయ్యాక బదిలీలు ఉంటాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details